రాజు గారి గది 4 రెడీ అవుతుంది..!

ఓంకార్ డైరక్షన్ లో అశ్విన్ హీరోగా వచ్చిన సినిమా రాజు గారి గది. సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సక్సెస్ అవడంతో రాజు గారి గది 2 నాగార్జున, సమంత లాంటి స్టార్స్ తో కలిసి చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. అయినా సరే రాజు గారి గది 3 కూడా తీశాడు ఓంకార్. ఈ సినిమా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయినా సరే రాజు గారి గది 4 కి రంగం సిద్ధం చేస్తున్నాడు ఓంకార్.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తుంది. రాజు గారి గది 4 కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. పార్ట్ 2,3 పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి రాజు గారి గది 4 స్క్రిప్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు ఓంకార్. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.