మైత్రి ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత..!

ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ తో సూపర్ హిట్ అందుకున్న సమంత అమేజాన్ ప్రైం నుండి మరో భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ కోసం సమంతకు దాదాపు 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. ఇదేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ నుండి ఓ స్టార్ హీరో సినిమా ఆఫర్ కూడా సమంత ముందుకు వచ్చిందట. అయితే సమంత మాత్రం సారీ అని చెప్పిందట. కేవలం ఫీమేల్ సెంట్రిక్ సినిమాలనే తప్ప కమర్షియల్ సినీమలను చేసే ఉద్దేశం లేదని మైత్రి మూవీ మేకర్స్ ఆఫర్ ను కాదని చెప్పిందట సమంత.

పెళ్లి తర్వాత కూడా సమంత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు, హోస్ట్ గా కూడా సమంత్ తన సత్తా చాటుతుంది. త్వరలోనే సమంత రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.