
ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ భామ కియరా అద్వాని తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బీ టౌన్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా పట్టించుకోని కియరా ఫైనల్ గా మళ్లీ కొరటల శివ డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పిందని టాక్. ఎన్.టి.ఆర్ సినిమా కాబట్టి కియరా కూడా సైన్ చేసిందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు అమండు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.