
చిన్నారి పెళ్లికూరుతు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఎక్కడికి పోతావు చిన్నవడా సినిమాతో హిట్ దక్కించుకున్నా అవికా గోర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈమధ్య తన లుక్ మీద దృష్టి పెట్టి స్లిం గా మారిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.
నాగ చైతన్య థ్యాంక్యు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న అవికా గోర్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా ఆది సాయి కుమార్ నటిస్తున్న అమరన్ సినిమాలో కూడా అవికా గోర్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి తెలుగులో అవికాకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఏది హిట్టైన తెలుగులో అమ్మడు తిరిగి ఫాం లోకి వచ్చినట్టే లెక్క.