
క్రాక్ హిట్ తో సూపర్ జోష్ మీద ఉన్న మాస్ మహరాజ్ రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శరత్ మండవ డైరక్షన్ లో ఓ సినిమా సైన్ చేశాడు. ఈ సినిమా కథ 1990 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్య తెలుగు సినిమాల్లో 80, 90వ దశకంలోని కథలను మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే రవితేజ కూడా అలాంటి కథకు ఓకే చెప్పాడట. పాతికేళ్ల నాటి కథతో రవితేజ సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కేరళ భామ రాజీషా విజయన్ నటిస్తుందని తెలుస్తుంది. మళయాళంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రాజీషా రవితేజ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత రవితేజ మరోసారి బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన భద్ర సూపర్ హిట్ కాగా 16 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది.