నాని నిర్మాణంలో మీట్ క్యూట్..!

నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. వాల్ పోస్టర్ బ్యానర్ లో నాని అ!, హిట్ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం హిట్ 2 కూడా సెట్స్ మీద ఉంది. ఇక లేటెస్ట్ గా నాని నిర్మాణంలో మరో సినిమా వస్తుంది. దానికి సంబందించిన షూటింగ్ నేడు మొదలైంది. నాని నిర్మాణంలో లేడీ డైరక్టర్ దీప్తి ఘంట డైరక్షన్ లో వస్తున్న సినిమా మీట్ క్యూట్. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ మొదలైంది.

నాని ఈ విషయాలను షేర్ చేస్తూ మీట్ క్యూట్ ఆన్ లొకేషన్ పిక్ షేర్ చేశాడు. సినిమాలో ప్రముఖ హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మీట్ క్యూట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా నిర్మాతగా నానికి మరో మంచి హిట్ అందిస్తుందని చెప్పొచ్చు.