ఐఏఎస్ కల కోసం సోనూ సూద్ 'సంభవం'..!

కరోనా టైం లో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే సాయం చేస్తూ వచ్చిన సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇప్పటికే ఆయన్ని ప్రైం మినిస్టర్ చేసేయాలన్న ఉత్సాహం మీద ఉన్నా దేశ ప్రజలు. ఇక ఇదిలాఉంటే సోనూ సూద్ మరో మహా కార్యానికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ కావడం మీ కల అయితే దాన్ని నేను సాకారం చేస్తా అంటున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఐఏఎస్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. కోచింగ్ కోసం వారికి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సంభవం అని పేరు పెట్టారు. సోనూ సూద్ చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజలన్ నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.