ఫ్యామిలీ మ్యాన్ ఎఫెక్ట్.. సమంతకు భారీ ఆఫర్..!

టాలీవుడ్ లో ప్రస్తుతం సమంత ఫామ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావు కాని సమంత మాత్రం దూసుకెళ్తుంది. సినిమాలే కాదు వెబ్ సీరీస్, స్పెషల్ షోస్ సమంత సూపర్ అనిపించుకుంటుంది. సమంత చేసిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సూపర్ హిట్ అయ్యింది. సమంత చేసిన బోల్డ్ అండ్ నెగటివ్ అటెంప్ట్ కు ప్రేషకులు ఫిదా అయ్యారు.

అమేజాన్ ఒరిజినల్ సీరీస్ ఫ్యామిలీ మెన్ 2లో సమంత నటన చూసిన కొందరు మేకర్స్ సమంత కోసం సెపరేట్ పాత్రలు సృష్టిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సమంతతో నెట్ ఫ్లిక్స్ మరో వెబ్ సీరీస్ కు ప్ర్యత్నిస్తుందని తెలుతుంది. సమంతకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి మరి ఈ వెబ్ సీరీస్ చేస్తున్నరని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటైల్స్ తెలియాల్సి ఉంది.