
రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ హీరోగా పవర్ పేట సినిమా రానుందని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ ఎగ్జిట్ అయ్యాడని తెలుస్తుంది. అతని ప్లేస్ లో మరో యువ హీరో శర్వానంద్ వచ్చి చేరాడని టాక్. నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నడు. మేర్లపాక గాంధీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.
పవర్ స్టార్ ఫ్యాన్ గా పవర్ పేట టైటిల్ తో సత్తా చాటుతాడని అనుకున్న నితిన్ ఇలా సడెన్ గా ప్రాజెక్ట్ నుండి బయటకు రావడం అందరికి షాక్ ఇస్తుంది. శర్వానంద్ కూడా ప్రస్తుతం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. మహా సముద్రం పూర్తి కాగానే ఈ పవర్ పేట పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.