
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు సలార్, ఆదిపురుష్ లు కూడా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఆల్రెడీ రెండు సినిమాలు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఉన్నాయి.
ఈ సినిమాల తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా సెలెక్ట్ కాగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నాకి ఛాన్స్ ఇస్తున్నారట. ప్రభాస్ సినిమా అది కూడా పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే ఈ సినిమాతో రాశి ఖన్నా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది. అమ్మడికి నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.