గీతా ఆర్ట్స్ నుండి పిలుపొచ్చిందట..!

అందాల రాక్షసి సినిమాతో నటుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ సడెన్ గా చి.ల.సౌ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎంచుకున్న కథను ప్రేక్షకులను మెప్పించేలా చేసిన చిలసౌ ప్రయత్నం డైరక్టర్ గా రాహుల్ రవీంద్రన్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ క్రేజ్ తోనే కింగ్ నాగార్జున హీరోగా సూపర్ హిట్ సీక్వల్ మన్మథుడు 2 సినిమా చేశాడు. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ఆ సినిమా తర్వాత రాహుల్ కు డైరక్షన్ ఛాన్సులు కూడా కరువయ్యాయి.

ఇదిలాఉంటే గీతా ఆర్ట్స్ నుండి రాహుల్ రవిచంద్రన్ కు పిలుపు వచ్చిందని తెలుస్తుంది. లాక్ డౌన్ లో కథలు రాసుకున్న రాహుల్ గీతా ఆర్ట్స్ బన్నీ వాసుకి ఒక లైన్ వినిపించాడట. లైన్ నచ్చిన బన్నీ వాసు ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్. మొత్తానికి ఫ్లాప్ వచ్చినా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుండి ఆఫర్ తెచ్చుకున్నాడు రాహుల్ రవిచంద్రన్.