
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు, మళయాళ అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఆ సినిమా తర్వాత మరోసారి సూపర్ హిట్ కాంబో త్రివిక్రం, పవన్ కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. పవన్, త్రివిక్రం కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు ఫ్యాన్స్ ను అలరించాయి. అజ్ఞాతవాసి తప్ప అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి.
ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ సర్కారు వారి పాట సినిమా కాగానే త్రివిక్రం తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మహేష్ సినిమా కాగానే పవన్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.