మాస్టర్ బ్యూటీకి టాలీవుడ్ ఆఫర్లు..!

మళయాళ భామ మాళవిక మోహనన్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. మళయాళంలో తన టాలెంట్ తో మెప్పిస్తున్న అమ్మడు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవడంతో ఆమెపై తెలుగు దర్శక నిర్మాతల కన్ను పడ్డది. ఇప్పటికే రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో మాళవికని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ రాగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తమిళ, మళయాళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ తెలుగు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ వచ్చిందని టాక్. ఆ రెండు సినిమాలు చేస్తే మాళవిక తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు.