
కళ్యాణ్ రాం నటిస్తూ నిర్మిస్తున్న భారీ సినిమా బింబిసారా. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన బింబిసారా సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను ఇన్వాల్వ్ చేస్తున్నారట. సినిమాకు తారక్ వాయిస్ ఓవర్ ఇస్తాడని టాక్. సినిమాలైతే చేస్తున్నాడు కాని స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డ కళ్యాణ్ రాం బింబిసారాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.
ఎన్.టి.ఆర్ కూడా ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న బింబిసారా సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.