
యువ హీరో శ్రీ విష్ణు లీడ్ రోల్ లో హషిత్ గోలి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజ రాజ చోర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 18న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక టీజర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ చేస్తూ బిగ్ బాస్ గంగవ్వతో చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటుంది. రాజ రాజ చోర వెరైటీ టైటిల్ మాత్రమే కాదు వెరైటీ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
సినిమాలో సునైనా, మేఘా ఆకాష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే ఆసక్తి కలిగేలా చేస్తున్నారు చిత్రయూనిట్. శ్రీ విష్ణు రీసెంట్ మూవీ గాలి సంపత్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరి రాజ రాజ చోరతో అయినా శ్రీ విష్ణు హిట్ కొడతాడేమో చూడాలి.