పక్కా కమర్షియల్ పోస్టర్.. గోపీచంద్ బర్త్ డే ట్రీట్..!

గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పక్కా కమర్షియల్ సినిమా మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశి ఖన్నా నటిస్తుంది. సినిమాలో గోపీచంద్ లాయర్ గా నటిస్తున్నారు.

ప్రతిరోజూ పండుగే తర్వాత మారుతి కొద్దిపాటి గ్యాప్ తో తీస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఇక కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేక వెనకపడ్డ గోపీచంద్ ఈ సినిమాతో మళ్లీ ఫాం లోకి రావాలని చూస్తున్నారు. జూన్ 12 హీరో గోపీచంద్ బర్త్ డే కానుకగా పక్కా కమర్షియల్ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో గోపీచంద్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు.