అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించనున్న చిరంజీవి..!

కరోనా టైంలో సినీ పెద్దగా సీసీసీ ద్వారా కార్మీకులకు కావాల్సిన నిత్యావసరాలను అందించడమే కాకుండా వారికి వ్యాక్సినేషన్ విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సీజన్ కొరత వల్ల ఇబ్బంది ఏర్పడగా జిల్లాల వారిగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సీజన్ బ్యాంక్ లను ఏర్పాట్ చేశారు. చిరు తన సేవలను మరింత విస్త్రుతం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో అంబులెన్స్ సర్వీస్ లను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది.   

తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ కొరత ఉందని తెలుసుకున్న చిరంజీవి ఉచిత అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబందించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది. చిరంజీవి చేస్తున్న ఈ సేవలకు అభిమానులు, నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.