
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో తన సినిమాలతో పాటుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని ఆదిత్య 369 సీక్వల్ లో మోక్షజ్ఞ నటిస్తారని చెప్పారు బాలకృష్ణ. ఆ సినిమాలో తను కూడా ఉంటానని చెప్పారు. తానే స్వయంగా ఆ సీక్వల్ కథ సిద్ధం చేశానని సింగీతం శ్రీనివాస రావు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని.. ఆయన చేయనంటే తానే డైరెక్ట్ చేస్తానని చెప్పారు బాలకృష్ణ.
ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ పార్టీలో రావడం పట్ల ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించలేదని అన్నారు.. ఎన్.టి.ఆర్ పార్టీలోకి వస్తే ప్లస్సా మైనస్సా అనే ప్రశ్న అడగ్గా దానికి కాసేపు మౌనంగా ఉండి చిరునవ్వు నవ్విన బాలకృష్ణ ప్లస్ మైనస్ అంటూ కాంబినేషన్ ల్ చెప్పి విషయాన్ని పక్కదారి పట్టించారు. మొత్తానికి ఎన్.టి.ఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య తన వర్షన్ చెప్పారని చెప్పొచ్చు.