సాయి ధరం తేజ్ 'రిపబ్లిక్'.. డిజిటల్ రైట్స్ రేటు అదిరింది..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, దేవా కట్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగ రిపబ్లిక్ ఓటిటి రిలీజ్ చర్చల్లో ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా జీ 5 ఓటిటి రిలీజ్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. రిపబ్లిక్ సినిమాను జీ 5 వారు 40 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది.

థియేటర్ రిలీజ్ ఆగిపోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో రిపబ్లిక్ నిర్మాతలకు ఈ సినిమా లాభాలు తెచ్చిందని తెలుస్తుంది. రిపబ్లిక్ సినిమా లో సాయి ధరం తేజ్ యంగ్ లీడర్ గా కనిపించనున్నారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన డైలాగ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. దేవా కట్ట తీసిన ప్రస్థానం రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.