అందంలోనూ.. అభినయంలోనూ.. సమంత సూపరంతే..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుంది. సాధారణంగా హీరోయిన్స్ కు పెళ్లైన తర్వాత కెరియర్ గ్రాఫ్ పడిపోతుంది కాని అక్కినేని కోడలు సమంతకు మాత్రం అది పెరుగుతూ వస్తుంది. సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్, స్పెషల్ షోస్ తో సమంత సూపర్ అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో రాజీ పాత్రలో నటించిన సమంత మరోసారి తన నటనతో అందరిని సర్ ప్రైజ్ చేసింది. 

రాజ్, డికే రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత రాజీ పాత్రలో నటించింది. శ్రీలంక తమిళ రెబల్ గా సమంత యాక్షన్, బోల్డ్ అన్నిటిలో సత్తా చాటింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చూసిన బాలీవుడ్ ఆడియెన్స్ కూడా సమంత నటనకు ఫిదా అవుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 లో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి సమంత సంతోషించారు. రాజీ పాత్ర కోసం ఆమె ప్రిపరేషన్.. తమిళుల అణచివేతకు సంబందించిన డాక్యుమెంటరీ వీడియోస్.. కష్టాలు.. ప్రాణాలు కోల్పోయిన తీరు తనని ఎంతగానో బాధించాయని చెప్పారు. అందంతోనే కాదు కరుడుకట్టిన ఉగ్రవాదిగా కూడా సమంత అద్భుతంగా నటించారు.