లూసిఫర్ రీమేక్ లో మెగా ప్రిన్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ సినిమా రీమేక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ ను కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ, బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఈ పాత్రలో వరుణ్ తేజ్ ను సెలెక్ట్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ తో ఎఫ్2 తో హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో కూడా ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే చిరు ఆచార్యలో చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా లూసిఫర్ రీమేక్ లో వరుణ్ తేజ్ ఓకే అయితే మెగా ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.