హైదరాబాద్ లో భారీ వర్షాలు.. బెల్లంకొండ సినిమకు 3 కోట్ల నష్టం..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ మూవీ ఛత్రపతి హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా తీసేది హిందీలోనే అయినా షూటింగ్ మాత్రం హైదరాబాద్ లోనే జరుగుతుంది. వి.వి.వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 3 కోట్ల భారీ సెట్ ఒకటి ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ లో భారీగా పడుతున్న వర్షాల వల్ల ఆ సెట్ మొత్తం డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి కాగా ఆ సెట్ లో ఇంకా చాలా పార్ట్ షూట్ చేయాల్సి ఉంది. ఇంతలోనే వర్షాలకు సెట్ అంతా డ్యామేజ్ అయ్యిందని తెలుస్తుంది.

ఈమధ్యనే అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాతో కూడా నిరాశపరచాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన కరణన్ సినిమా తెలుగు రీమేక్ లో శ్రీనివాస్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రీమేక్ సినిమాను కూడా వినాయక్ డైరెక్ట్ చేస్తారని టాక్.