పవర్ స్టార్ తో శ్రీకాంత్ అడ్డాల..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగం పెంచారు. ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ దానితో పాటుగా మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు హరీష్ శంకర్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పవన్. ఇక లేటెస్ట్ గా సెన్సిబుల్ డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో కూడా పవర్ స్టార్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

దిల్ రాజు బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో పవన్ హీరోగా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే పవన్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. శ్రీకాంత్ చెప్పిన లైన్ నచ్చడంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.