
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పటికే మీకు మాత్రమే చెప్తా సినిమా నిర్మించిన విజయ్ దేవరకొండ తన సెకండ్ ప్రొడక్షన్ గా తమ్ముడు ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ నిర్మాతగా 3వ సినిమా సన్నాహాలు చేస్తున్నాడట. పృధ్విసేన డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో అంతా నూతన నటీనటులు ఉంటారని తెలుస్తుంది.
ఇక విజయ్ నటిస్తున్న సినిమా విషయానికి వస్తే పూరీ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు మన రౌడీ హీరో. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.