ఏక్ మిని హిట్.. హీరోకి అదిరిపోయే ఆఫర్..!

డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా కార్తీక్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఏక్ మిని హిట్. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు యువ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. స్మాల్ పెనీస్ సిండ్రోం లాంటి డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చింది. రీసెంట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాతో హీరో సంతోష్ శోభన్ కు మంచి పాపులారిటీ వచ్చింది. 

డిఫరెంట్ కథలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఏక్ మిని కథను హిట్ చేశారు. తను నేను, పేపర్ బోయ్ సినిమాల్లో నటించిన సంతోష్ శోభన్ ఫైనల్ గా తన థర్డ్ మూవీతో మొదటి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ అవడమే కాదు మరో మూడు లక్కీ ఛాన్సులు అందుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైజయంతి బ్యానర్ లో నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా కన్ ఫాం అయ్యిందట. వైజయంతి బ్యానర్ సినిమా అంటే సంతోష్ శోభన్ హీరోగా ట్రాక్ ఎక్కినట్టే అని చెప్పొచ్చు.