
మళయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు రాం చరణ్. ఆ సినిమా రీమేక్ రైట్స్ ను కొనేశారు చరణ్. లాల్ జూనియర్ డైరెక్ట్ చేసిన మళయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ లో పృధ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు కలిసి నటించారు. ఈ సినిమాను తెలుగులో మెగా హీరోలతో రీమేక్ చేయాలని అనుకున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ సినిమాపై ఆసక్తి చూపించాడని వార్తలు వచ్చాయి.
లేటెస్ట్ గా ఈ రీమేక్ లో మాస్ మహరాజ్ రవితేజ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. రవితేజతో పాటు మరో మెగా హీరో ఈ సినిమాలో నటిస్తాడని టాక్. మొత్తానికి మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రవితేజ ప్రస్తుతం ఖిలాడి మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శరత్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమా పూర్తి చేశాక డ్రైవింగ్ లైసెన్స్ కు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.