
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. బాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీలో బాక్సింగ్ ఫైట్ సీన్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను దించుతున్నారట. పలు హాలీవుడ్ సినిమాలకు ఫైట్ కంపోజ్ చేసిన లార్నెల్ స్టోవెల్, రీంబుర్ లను వరుణ్ తేజ్ గని కోసం తీసుకొచ్చారని తెలుస్తుంది.
సినిమా కథ, కథనాలు ఒక ఎత్తైతే గనిలో యాక్షన్ పార్ట్.. అదే బాక్సింగ్ ఫైట్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మొదటి సినిమానే అయినా కిరణ్ కొర్రపాటి సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ టెక్నిషియన్స్ తో ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు అంటే వరుణ్ తేజ్ కు గని తో మరో సూపర్ హిట్ ఖాతాలో పడినట్టే అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ఎఫ్3 మూవీలో కూడా నటిస్తున్నాడు వరుణ్ తేజ్.