
సైరా నరసింహా రెడ్డి తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడఖన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ గా కింగ్ మేకర్ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా త్రిషని సెలెక్ట్ చేసినట్టు టాక్.
లూసిఫర్ రీమేక్ తో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో కూడా ఓ సినిమా కన్ ఫాం చేశారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదేకాకుండా మెహెర్ రమేష్ డైరక్షన్ లో కూడా చిరు సినిమా ఉంటుందని తెలుస్తుంది. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా మెహెర్ రమేష్, చిరు కాంబో మూవీ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి చిరు వరుస సినిమాలతో తన సత్తా చాటనున్నారు.