నితిన్ 'మాస్ట్రో' ఓటిటి రిలీజ్..?

లవర్ బోయ్ నితిన్ హీరోగా మేర్లపాక గాధీ డైరక్షన్ లో వస్తున్న సినిమా మాస్ట్రో. నితిన్ సొంత నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ కు రీమేక్ గా వస్తుంది. సినిమాలో నభా నటేష్, తమన్నా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ మాస్ట్రో సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితి అందుకే వచ్చిన ఓటిటి ఆఫర్ కు ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ ఇయర్ ఆల్రెడీ నితిన్ చెక్, రంగ్ దే సినిమాలు థియేట్రల్ రిలీజ్ అయ్యాయి. అయితే చెక్ ఫ్లాప్ అవగా రంగ్ దే మాత్రం మంచి ఆదరణ పొందింది.