సంబంధిత వార్తలు

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా బింబిసారా. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. క్రీస్తుపూర్వం 5వ శతాబ్ధానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు ఆ కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. చూస్తుంటే కళ్యాణ్ రామ్ మరో బాహుబలి సినిమా చేస్తున్నట్టు ఉన్నాడు.
ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్.టి.ఆర్ 98వ జయంతి సందర్భంగా శుక్రవారం బింబిసారా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.