ప్రభాస్ తో డేట్ కు రెడీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే కేవలం ఫ్యాన్స్, ఆడియెన్స్ కు మాత్రమే కాదు సినీ తారలకు ఇష్టమే. లేటెస్ట్ గా ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో చేరింది కన్నడ భామ రష్మిక మందన్న. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక మరో రెండు క్రేజీ సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. 

ఇక రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే రష్మిక మందన్న లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. టాలీవుడ్ హీరోలతో ఎవరితో డేట్ చేస్తారు అని అడిగిన అభిమాని ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ పేరు చెప్పింది రష్మిక. ప్రభాస్ తో డేట్ కు తాను రెడీ అని అన్నది అమ్మడు. అంతేకాదు తనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది రష్మిక. మరి కన్నడ భామ రష్మిక కోరికని ప్రభాస్ తీరుస్తాడో లేదా అన్నది చూడాలి.