
అల వైకుంఠపురములో తర్వాత సూపర్ ఫాం లోకి వచ్చిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశాడు. సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమాతో బన్నీ బాక్సాఫీస్ పై పంజా విసిరేందుకు రెడీ అవుతున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ తో బన్నీ నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయినే పెట్టుకోవాలని చెప్పాడట అల్లు అర్జున్. బన్నీ చెప్పినట్టుగా సుకుమార్ ఇద్దరు ముగ్గురు తెలుగు అమ్మాయిలను ఆడిషన్స్ చేశాడట. కాని ఆయన అనుకున్న విధంగా వారు కుదరకపోవడంతో ఫైనల్ గా బన్నీని ఒప్పించి రష్మిక మందన్నని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేస్తున్న పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.