విజయ్ నోటా ఆరోజు వస్తుంది

విజయ్ దేవరకొండ ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ పై ఉన్న కన్ ఫ్యూజన్ తొలగిపోయింది. అక్టోబర్ 5, 10, 18 అంటూ ప్రేక్షకులకే తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయమని పోలింగ్ పెట్టిన విజయ్ దేవరకొండ ఫైనల్ గా రిలీజ్ డేట్ ను అక్టోబర్ 5న ఫిక్స్ చేసుకున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిఎం పాత్రలో కనిపిస్తున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ పై చిన్నపాటి కన్ ఫ్యూజన్ ఏర్పడింది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కె.ఇ. జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్నారు. గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల హీరో అనిపించుకున్న విజయ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇక ఇదే కాకుండా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా కూడా త్వరలో రిలీజ్ కానుంది.