విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం
డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా విజయ్ స్టామినా ప్రూవ్
చేసింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో గీతా
గోవిందం చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా ఒక్క నైజాం ఏరియాలో 19 కోట్ల దాకా వసూళు చేసింది. నైజాం లో స్టార్ హీరోల సినిమాలే 20 కోట్లు రీచ్ అవలేదు.
గీతా గోవిందంతో వారికి సమానంగా విజయ్ 19
కోట్ల దాకా వసూళ్లను రాబట్టడం నైజాంలో విజయ్
రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది. తెలంగాణా హీరోగా విజయ్ కు నైజాం లో స్పెషల్ ఫ్యాన్స్
ఏర్పడ్డారు. 3 సినిమాలతోనే విజయ్ స్టార్ ఇమేజ్
తెచ్చుకోవడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని
అంచనా వేయొచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు.
అదే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో నోటా సినిమా కూడా
వస్తుంది.