అరవింద సమేత ఆడియోకి బాలయ్య..!

హరికృష్ణ మరణంతో కొన్నాళ్లుగా దూరం ఉంటున్న బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య మాటలు కలిశాయి. బాబాయ్ అబ్బాయ్ ల మధ్య వైరం నందమూరి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. వీరిద్దరు ఎప్పుడు ఒకే వేదిక మీద కనిపిస్తారా అని ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూశారు. కాని దానికి హరికృష్ణ మరణం కారణమవుతుందని ఊహించలేదు. ఇక అన్న కొడుకులకు అండగా నిలబడేందుకు ముందుంటున్నాడు బాలకృష్ణ.

ఈ క్రమంలో భాగంగా ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత ఆడియో వేడుకకు బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఆడియోకి బాలయ్య వస్తే ఇక ఆ హంగామా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22న రిలీజ్ కానున్న అరవింద సమేత ఆడియోకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తుండగా తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.