రజిని పేట్టా మోషన్ పోస్టర్

సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో రోబో సీక్వల్ గా 2.ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకముందే మరో సినిమా మొదలుపెట్టారు. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో రజిని హీరోగా వస్తున్న సినిమా పేట్టా. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ చూస్తుంటే భాషా సినిమాలో రజిని గుర్తుకు రావడం ఖాయం.

కబాలి, కాలా తర్వాత రజిని 2.ఓతో ఇక సినిమాలు ఆపేస్తాడని టాక్ వచ్చినా కార్తిక్ సుబ్బరాజు చెప్పిన లైన్ నచ్చడంతో రజిని వెంటనే సినిమా ఓకే చేశారు. పేట్టా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, సిమ్రా, నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.