చంద్రబాబుగా రానా ఫోటో లీక్..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ మొదలు పెట్టిన ఎన్.టి.ఆర్ మూవీలో నారా చంద్రబాబు నాయుడిగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా లుక్ పై ఇన్నాళ్లు కన్ ఫ్యూజన్ ఉండగా నారా చంద్రబాబు నాయుడిగా రానా పూర్తి స్థాయి మేకోవర్ తో కనిపించాడు. ఇక లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ సెట్స్ లో రానాని చూసి అందరు షాక్ అవుతున్నారు.

అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో అచ్చం అలానే రాఅ ఉన్నాడు. లీకైన పిక్ తో రానా డెడికేషన్ కు మరోసారి వారెవా అనేస్తున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విద్యా బాలన్, సుమంత్, రానా, కళ్యాణ్ రాం నటిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.