
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరోసారి రాం చరణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. చరణ్, వంశీ కలిసి చేసిన మొదటి సినిమా ఎవడు. ఆ సినిమా చరణ్ కెరియర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా సెట్ చేస్తున్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న రాం చరణ్ ఇది పూర్తి కాగానే రాజమౌళి మల్టీస్టారర్ చేస్తున్నాడు. అది కూడా పూర్తయ్యాక కాని వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి కావాలి అంటే కచ్చితంగా 2020 వరకు వంశీ ఆగాల్సిందే. 2019 లోనే మహేష్ సినిమా పూర్తవుతుంది. మరి చరణ్ కోసం ఏడాది పాటు వెయిట్ చేస్తాడా లేక వేరే హీరోతో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.