
తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధిస్తున్నాయి అంటే అది కచ్చితంగా బాహుబలి వల్లనే అని చెప్పొచ్చు. రాజమౌళి తీసిన బాహుబలి మొదటి రెండు భాగాలు చైనా, జపాన్ లలో కూడా అక్కడ భాషలో అనువదించి మరి రిలీజ్ చేశారు. అయితే జపాన్ లో రజినికాంత్ ముత్తు 3 మిలియన్ డాలర్స్ తో సంచలన రికార్డ్ సృష్టించింది. అందుకే ఇప్పటికీ రజిని సినిమాలు జపాన్ లో సందడి చేస్తుంటాయి.
ఇక లేటెస్ట్ గా రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా జపనీస్ లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. 2009లో టాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన మగధీర ఇప్పుడు జపాన్ లో రికార్డులు నెలకొల్పుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 1.06 మిలియన్ డాలర్స్ వచ్చాయట. ముత్తు తర్వాత 1.5 మిలియన్ డాలర్స్ సెకండ్ ప్లేస్ లో ఉండగా చూస్తుంటే జపాన్ లో మగధీర సెకండ్ ప్లేస్ లో నిలిచేలా ఉంది. బాహుబలి మాత్రం ఫుల్ రన్ లో 1.3 మిలియన్ డాలర్స్ వసూళు సాధించింది.