
భరత్ అనే నేను సక్సెస్ తో మహేష్ సినిమాల స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా దాదాపు 150 కోట్ల దాకా పెట్టేందుకు ఫిక్స్ అయ్యారట. స్టార్ సినిమా ఎంత బడ్జెట్ పెట్టినా దానికి తగిన ఓపెనింగ్ ఉంటాయి.
ఇక సినిమా అంచనాలను అందుకుంటే కనుక ఆ లెక్క వేరేలా ఉంటుంది. సుకుమార్, మహేష్ ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశారు. ఆ సినిమా అంచనాలను అందకున్నా రంగస్థలం సూపర్ సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న సుకుమార్ ఈ సారి మహేష్ కు అదిరిపోయే హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. బడ్జెట్ కూడా భారీగానే ఉంది కాబట్టి ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయితే నాన్ బాహుబలి మాత్రమే కాదు బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.