
ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి స్టార్ హీరోయిన్ కైనా క్రేజ్ తగ్గిపోవాల్సిందే. కాని తెలుగు, తమిళ భాషల్లో తనదైన పాపులారిటీతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ సూపర్ ఫాంలో కొనసాగిస్తుంది. పెళ్లి తర్వాత వచ్చిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు మూడు సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇక ప్రస్తుతం యూటర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత తన తర్వాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తుందని తెలుస్తుంది.
అల్లు అర్జున్ తో ఆల్రెడీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సమంత. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక మళ్లీ బన్నితో విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ కోసం జతకడుతుందట. విక్రం సూర్య కలిసి చేసిన 24 సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా చేసింది. మరి పెళ్లి తర్వాత డిఫరెంట్ సినిమాలు చేస్తానని చెప్పిన సమంత కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నది చూడాలి. బన్నితో సినిమా న్యూస్ రూమరేనా లేక వాస్తవమా అన్నది తెలియాలంతే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే.