వైష్ణవ్ తేజ్ వచ్చేస్తున్నాడు..!

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ అని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాటే. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముహుర్తం దగ్గర పడింది. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరక్షన్ లో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తుందని తెలుస్తుంది. అసలైతే సాయి కొర్రపాటి వైష్ణవ్ తేజ్ ను ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉన్నా రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ విజేత నిరాశ పరచడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గాడు.  

వైష్ణవ్ తేజ్ మూవీ సుకుమార్ పర్యవేక్షణలో వస్తుందట. ప్రస్తుతం సుకుమార్ మహేష్ 26వ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ సినిమా కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లో వస్తుందట. మెగా హీరో బాధ్యత మీద వేసుకున్న సుకుమార్ వైష్ణవ్ తేజ్ కోసం ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.