
ఈ ఇయర్ సెన్సేషనల్ మూవీస్ లో ఒకటిగా సూపర్ సక్సెస్ అయ్యింది ఆరెక్స్ 100. బోల్డ్ కంటెంట్ తో వచ్చినా అందులో కాన్సెప్ట్ మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేసింది. యూత్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ వరుసగా అవకాశాలను అందుకుంటుంది.
అయితే తనకు వచ్చే ఛాన్సులన్ని ఆరెక్స్ 100 తరహాలో ఉండటంతో కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు లేటెస్ట్ గా భాను శంకర్ డైరక్సన్ లో సినిమా ఓకే చేసింది. ఆరెక్స్ 100లో తన పాత్రకు పూర్తి విరుద్ధంగా ఈ సినిమాలో తన రోల్ ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా నిర్మాత సి. కళ్యాణ్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా పాయల్ రాజ్ పుత్ ఎంపికయ్యిందని తెలుస్తుంది. ఆ సినిమా డీటైల్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది.