ఇండియన్-2 ప్రీ లుక్ అదుర్స్

విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996లో వచ్చిన ఆ సినిమా ఇండియా వైడ్ గా సంచలన విజయం అందుకుంది. ఇండియన్ సినిమా తెలుగు తమిళ భాషల్లోనే కాదు హిందిలో కూడా రికార్డులు సృష్టించింది. 22 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారు శంకర్. రోబో సీక్వల్ గా 2.ఓ రిలీజ్ కు రెడీ అవుతుండగా శంకర్ ఇండియన్ 2 సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.


ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. మణికట్టు మంత్రాన్ని ఉపయోగించి శత్రువులను మట్టికరిపించిన ఆనాటి భారతీయుడు ఫేమస్ సిగ్నేచర్ తోనే ప్రీ లుక్ వచ్చింది. చేతివేళ్లను చూపిస్తూ వదిలిన ప్రీ రిలీజ్ అదిరిపోయింది. 2.ఓ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. ప్రీ లుక్ సినిమాపై మరింత అంచనాలు పెంచగా కచ్చితంగా మరోసారి ఇండియన్ 2 రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.