గూఢచారికి భలే ఆఫర్..!

ఆన్ స్క్రీన్ గూఢచారి అడవి శేష్ అయినా ఆ సినిమా అలా వచ్చేందుకు కృషి చేసిన ఆఫ్ స్క్రీన్ గూఢచారి శషి కిరణ్ తిక్క. ఆయనే ఆ సినిమాకు దర్శకుడు. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా గూఢచారి. 6 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉందని చెప్పొచ్చు. అడవి శేష్ నటనతో పాటుగా ఈ సినిమా కథ, కథనం అందించడం జరిగింది. ఈ సినిమాకు శషి కిరణ్ తిక్క డైరక్షన్ టాలెంట్ కూడా అదరగొట్టేసింది. అందుకే అతనికి క్రేజీ ఆఫర్ పలుకరించింది.   

గూఢచారితో సత్తా చాటిన శషి కిరణ్ కు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుండి ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం చైతు శైలజా రెడ్డి అల్లుడు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాని, నితిన్ లతో వరుస సినిమాలు చేస్తుంది. శషి కిరణ్ కు ఆ ప్రొడక్షన్ నుండి ఛాన్స్ ఇస్తున్నారు. కథ చెప్పి ఓకే చేయించుకోవడమే ఉంది. మరి గూఢచారి తర్వాత శషి కిరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడో.. ఏ హీరోని పెట్టి సినిమా చేస్తాడో చూడాలి.