
సమంత లీడ్ రోల్ లో కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమా రీమేక్ గా వస్తున్న సినిమా యూటర్న్. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 13న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ నిజంగానే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది.
కర్మ థీం సాంగ్ తో వచ్చిన ఈ పాటలో సమంత, అనిరుధ్ నటించడం జరిగింది. సమంతతో పాటుగా ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు పోటీగా రంగంలో దిగుతుంది. క్రైం థిల్లర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. థీం సాంగ్ తో స్పెషల్ సర్ ప్రైజ్ చేసిన సమంత సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.