
బిగ్ బాస్ షోలో అసలైన మజా మొదలైంది. షో ముగిసేందుకు మరో మూడు వారాలే ఉండటంతో ప్రతి వారం ఎలిమినేషన్ టాస్క్ మరింత టైట్ అవుతుంది. లాస్ట్ వీక్ నుండి డబుల్ ఎలిమినేషన్ మొదలు పెట్టారు బిగ్ బాస్. శనివారం గణేష్ ను ఎలిమినేషన్ డిక్లేర్ చేసిన నాని.. ఆదివారం నూతన్ నాయుడుని ఇంటి నుండి బయటకు పంపించాడు. ఇద్దరు కామన్ మెన్ ఇద్దరూ ఒకేసారి ఎలిమినేట్ అవడం జరిగింది.
అయితే బిగ్ బాస్ లో నూతన్ నాయుడు బదులు అమిత్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉందట. ఓటింగ్స్ ప్రకారం చూస్తే తక్కువ ఓట్స్ అమిత్ కే వచ్చాయట. కాని అమిత్ ను సేవ్ చేసి నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు. నూతన్ నాయుడు రీ రీ ఎంట్రీ పట్ల ఇంటి సభ్యులు తరచూ డిస్కస్ చేసుకోవడం చూసి నూతన్ నాయుడికి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా అమిత్ ను సేవ్ చేసి నూతన్ ను ఎలిమినేట్ చేశారు.
ఇక మరో మూడు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 2లో ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు.. టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న దాని మీద రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.