గీతా ఆర్ట్స్ లో మహేష్..!

భరత్ అనే నేను తర్వాత మహేష్ తన 25వ సినిమాగా మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 26వ సినిమాగా సుకుమార్ డైరక్షన్ లో వస్తుంది. వన్ నేనొక్కడినే తర్వాత సుక్కు, మహేష్ ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఈ సినిమా కాకుండా 27వ సినిమాగా అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా ముందు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని అనుకోగా సుకుమార్ సినిమా ఎలాగు మైత్రి టేకప్ చేసింది కాబట్టి సందీప్ వంగ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ దగ్గర మహేష్ డేట్స్ ఉండటంతో మహేష్, సందీప్ వంగ సినిమా ఫిక్స్ చేశారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.