సమంత బ్రాండ్ తో వెజిటబుల్స్ సేల్..!

హీరోయిన్ గా క్రేజ్ సంపాదించడమే కాదు తనకు తోచిన మంచి పనులు చేస్తూ వస్తున్న సమంతకు స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకుంది. అక్కినేని కోడలిగా కొత్త భాధ్యత తీసుకున్న సమంత తను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా జామ్ మార్కెట్ లో కూరగాయలు అమ్మింది సమంత. సడెన్ గా జామ్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ ఓ మహిళ దగ్గరకు వెళ్లి తన కూరగాయలమ్ముతా అని పర్మిషన్ తీసుకుంది. 

సమంత బ్రాండ్ తో కూరగాయలన్ని మొత్తం సేల్ అయ్యాయి. రేటు అడగకుండా కూరగాయలన్ని కొనేశారు సమంత ఫ్యాన్స్. ఈ మొత్తాన్ని తాను ప్రత్యూష ఫౌండేషన్ కోసం వాడుతానని ప్రకటించారు. ఇక పెళ్లి తర్వాత కెరియర్ మరింత స్ట్రాంగ్ చేసుకుంది సమంత. ప్రస్తుతం యూటర్న్ సినిమా చేస్తున్న సమంత తన భర్త నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు పోటీగా ఆ సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.