
సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతాలు సృష్టించింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు జీవం పోశారు. జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ అలరించాడు. మహానటి సినిమా బుల్లితెర మీద కూడా విజయ దుందుంభి మోగించింది.
స్టార్ మాలో లాస్ట్ సండే టెలికాస్ట్ అయిన మహానటి సినిమా 20.16 రేటింగ్ తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ లో టి.ఆర్.పి తెచ్చుకున్న సినిమా ఇదే. మహానటి సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ రెండిటిలోనూ మహానటి సూపర్ హిట్ అయ్యింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాను స్వప్న, ప్రియాంకా దత్ లు నిర్మించారు.